సందర్భం : జార్ఖండ్‌ కథ ఆస్కార్‌‌కు నామినేట్‌

సందర్భం : జార్ఖండ్‌ కథ  ఆస్కార్‌‌కు నామినేట్‌

ఆస్కార్‌‌‌‌‌‌‌‌‌‌ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షల మంది డైరెక్టర్​, నటుల కల. దాన్ని సాకారం చేసుకునేందుకు ఎంతోమంది ప్రతి ఏడాది ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి ఆస్కార్‌‌‌‌‌‌‌‌కు మన దగ్గర తీసిన ఓ చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్‌‌‌‌ నామినేట్ అయ్యింది. అంతేకాదు.. ఈ డాక్యుమెంటరీ ఇప్పటివరకు ఎన్నో ఇంటర్నేషనల్‌‌‌‌ ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌‌‌లో స్క్రీనింగ్​ అయింది. ఇది బోలెడన్ని అవార్డులు కూడా దక్కించుకుంది. 

మన దేశంలో తీసిన డాక్యుమెంటరీ ఫీచర్ ‘టు కిల్ ఎ టైగర్’ 96వ ఆస్కార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెస్ట్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో నామినేషన్ పొందింది. టు కిల్ ఎ టైగర్ ప్రస్తుతం బోబి వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్, ది ఎటర్నల్ మెమరీ, ఫోర్ డాటర్స్, 20 డేస్ ఇన్ మారియుపోల్ లాంటి ఇతర డాక్యుమెంటరీలతో పోటీపడుతోంది. టు కిల్ ఎ టైగర్​ను 2022 సెప్టెంబర్ 10న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో ప్రీమియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షో వేశారు. తర్వాత జూన్ 2023లో జరిగిన లైట్‌‌‌‌‌‌‌‌హౌస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో కూడా చోటు దక్కించుకుంది. ఉత్తమ కెనడియన్ ఫీచర్ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌గా యాంప్లిఫై వాయిస్ అవార్డు గెలుచుకుంది. 

కథేంటి? 

జార్ఖండ్‌‌‌‌‌‌‌‌లోని ఒక చిన్న రైతు కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన పదమూడేళ్ల చిన్నారిపై ముగ్గురు దుర్మార్గులు లైంగిక దాడికి పాల్పడతారు. ఆమెకు న్యాయం జరగాలని ఆ కుటుంబం చేసిన ప్రయత్నాలే ఈ డాక్యుమెంటరీ. ఆ క్రూరమైన నేరానికి బాధ్యులైన వాళ్లకు శిక్ష పడేలా చేయాలనే  ప్రయత్నంలో ఆమె తండ్రి రంజిత్‌‌‌‌‌‌‌‌ ఎంత కష్టపడాల్సి వచ్చింది? ఆమె తల్లిదండ్రులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? న్యాయం కోసం అతను చేసిన పోరాటం ఫలించిందా? లేదా? అనేది ఈ  డాక్యుమెంటరీలో చూపించారు. 

ఈ కథలో మహిళలపై అణచివేత, సొసైటీలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను చక్కగా చూపించారు.  భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది. కానీ.. బాధితుల్లో 30 శాతం కంటే తక్కువ మంది మాత్రమే బయటికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు.  అలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలనే ఉద్దేశంతోనే రంజిత్ పోరాటం మొదలుపెడతాడు. రంజిత్, అతని కూతురి ధైర్యమే కథకు ప్రధాన బలం. అత్యాచారం చేసిన ముగ్గురు గ్రామానికి చెందిన నాయకుల పిల్లలు కావడంతో  కేసును వెనక్కి తీసుకోవాలని రంజిత్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెడతారు. అతను మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఒంటరి పోరాటం చేస్తాడు.

ఊరంతా ఏకమైనా రంజిత్ మాత్రం కేసును వెనక్కి తీసుకోకపోవడం.. ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంది. ఈ డాక్యుమెంటరీ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌కి అందుబాటులో లేదు. త్వరలో ఏదైనా ఓటీటీలో రిలీజ్‌‌‌‌‌‌‌‌ అయ్యే అవకాశం ఉంది. ఈ డాక్యుమెంటరీకి ఇప్పటివరకు దాదాపు 21 అవార్డులు వచ్చాయి.  

నిషా పహుజా

టు కిల్ ఎ టైగర్ డాక్యుమెంటరీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిషా పహుజా. ఆమె ఢిల్లీలో పుట్టింది. కానీ.. ఇప్పుడు కెనడాలోని టొరంటోలో సెటిల్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. నిషా1970ల్లోనే  కుటుంబంతో కలిసి కెనడాకు షిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. టొరంటో యూనివర్సిటీలో ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ లిటరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసింది. తర్వాత సీబీసీ(కెనడియన్​ బ్రాడ్​కాస్టింగ్​ కార్పొరేషన్​ ) డాక్యుమెంటరీ ‘సమ్ కైండ్ ఆఫ్ అరేంజ్‌‌‌‌‌‌‌‌మెంట్’కి రీసెర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసింది. తర్వాత నిషా కెనడియన్ ఫిల్మ్ మేకర్స్‌‌‌‌‌‌‌‌ జాన్ వాకర్, అలీ కజిమీతో కలిసి పనిచేసింది. 

నిషా 2012లో తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ చాలా గుర్తింపు తీసుకొచ్చింది. అంతేకాదు.. ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ నుండి జ్యూరీ అవార్డు కూడా గెలుచుకుంది. హాట్ డాక్స్ నుండి బెస్ట్‌‌‌‌‌‌‌‌ కెనడియన్ డాక్యుమెంటరీ అవార్డు అందుకుంది. ఆమె సినిమాలు ఎక్కువగా ఉత్తర అమెరికా, ఇండియాలో సక్సెస్ అయ్యాయి. ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఫెస్టివల్స్‌‌‌‌‌‌‌‌లో ప్రదర్శించారు. ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ మేకర్ అనురాగ్ కశ్యప్ సాయంతో ఈ డాక్యుమెంటరీని 2014లో ఇండియాలోని థియేటర్లలో కూడా రిలీజ్​ చేశారు. ప్రస్తుతం ఆమె ‘బాలీవుడ్ బౌండ్’ అనే మరో ఫీచర్ డాక్యుమెంటరీ తీస్తోంది.

2018 ఔట్‌‌ 

వాస్తవానికి ఈ సారి ఆస్కార్ బరిలో మలయాళ సినిమా ‘2018 ఎవ్రీ వన్‌‌ ఈజ్ హీరో’  నిలుస్తుందని అనుకున్నారు. కానీ.. అది పోటీలో నిలవలేకపోయింది. ఈ సినిమాను కేరళ వరదల నేపథ్యంగా తీశారు. ఇండియా తరఫు నుంచి ఆస్కార్ పోటీకి నామినేట్ చేశారు. దీన్ని జూడ్ ఆంథోనీ జోసెఫ్ డైరెక్ట్‌‌ చేశాడు. ఆస్కార్ ఫీచర్ ఫిల్మ్‌‌ విభాగంలో పోటీకి దిగినా.. షార్ట్‌‌లిస్టులో సెలక్ట్‌‌ అయిన15 సినిమాల్లో ‘2018’ లేదు. ఈ నేపథ్యంలో బెస్ట్‌‌ డాక్యుమెంటరీల లిస్ట్‌‌లో ఇండియా నుంచి  ‘టు కిల్ ఎ టైగర్’ అర్హత పొందడంతో అందరి ఆశలు దీనిపైనే ఉన్నాయి.