ఎస్టీపీపీని అత్యుత్తమ ప్లాంట్గా నిలబెట్టాలి : సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పొట్రు

ఎస్టీపీపీని అత్యుత్తమ ప్లాంట్గా నిలబెట్టాలి :  సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పొట్రు

జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్ గా నిలబెట్టాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు అన్నారు. బుధవారం ఆయన ఎస్టీపీపీని సందర్శించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవితో కలిసి ప్లాంట్ మోడల్ ను పనితీరును పరిశీలించారు. ఎఫ్​జీడీ నిర్మాణ పనులు, త్వరలో నిర్మించబోయే మూడో యూనిట్ ప్రాంతాన్ని, ఫ్లోటింగ్, గ్రౌండ్ సోలార్ ప్లాంట్లను పరిశీలించారు. ఎస్టీపీపీ అడ్మిన్ బిల్డింగ్​లో అధికారులతో సమావేశమై కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం, సీఎస్​ఆర్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మెయిన్ గేట్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్టీపీపీ ఈడీ, సీఎంఓఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉద్యోగులు ఆయనను కోరారు. ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. డీజీఎంలు శివప్రసాద్, పంతులా, పీవీ బ్రహ్మం, ఎఫ్​జీడీ ఈఈ భార్గవ్, జీఎంలు నరసింహ రావు, చీఫ్(ఓఅండ్ ఎం) జేఎన్ సింగ్, మురళీధర్, మదన్ మోహన్, శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.