
హైదరాబాద్ : చిక్కడపల్లి ఆజామాబాద్ లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ముఖానికి మాస్కులు వేసుకొని వచ్చిన నలుగురు… ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులను కర్రలతో కొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేసి పరారయ్యారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.