
ముంబై : ముంబైలోని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్‌లోకి ఆగంతకులు ఇద్దరు చొరబడ్డారు. చొరబాటును గుర్తించిన భద్రతా సిబ్బంది దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆ యువకులు తాము గుజరాత్ నుంచి వచ్చామని, షారుఖ్ ఖాన్ అంటే చాలా అభిమానమని, ఆయన్ను చూడటానికే అలా చేసినట్లు తెలిపారు. అయితే వారిపై ఐపీసీ ప్రకారం అతిక్రమణ, మరి కొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.