
- బాధితులు ఆస్పత్రికి పరుగులు
- భయాందోళనలో పట్టణ ప్రజలు
సిరిసిల్ల టౌన్, వెలుగు: సిరిసిల్ల జిల్లాలో వీధి కుక్క స్వైర విహారం చేసింది. సుమారు 50 మందిపై దాడికి పాల్పడింది. దీంతో కుక్కకాటు బాధితులు వరుసగా ఆస్పత్రికి క్యూ కట్టారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల టౌన్ నెహ్రూనగర్, సాయినగర్, గణేశ్ నగర్ తో పాటు పలు ప్రాంతల్లో గురువారం వీధి కుక్క స్వైర విహారం చేస్తూ ఎదురుగా వచ్చిన వారిపై దాడి చేసింది. చిన్న పిల్లలు, వృద్ధులను సైతం వదలలేదు.
సుమారు50 మందిని కరిచింది. బాధితులు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి పరుగు తీశారు. డాక్టర్లు వెంటనే ట్రీట్ మెంట్ అందించారు. ఘటనపై తెలియడంతో పట్టణ కాంగ్రెస్ నేతలు చొప్పదండి ప్రకాశ్, గడ్డం నర్సయ్య ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వెంటనే వీధి కుక్కల బెడద నుండి ప్రజలను రక్షించాలని అధికారులను బాధితులు, నేతలు కోరారు.