కనికరంలేని కన్నవారు.. చెత్తకుప్పలో పసికందు

కనికరంలేని కన్నవారు.. చెత్తకుప్పలో పసికందు

భువనేశ్వర్ : తల్లిదండ్రులు చేసిన తప్పుకు ఓ పసికందు లోకం చూడకుండానే కన్నుమూసింది. నెలలు నిండని పసికందును చెత్తకుప్పలో పడేశారు కనికరంలేని కన్నవారు. ఈ సంఘటన ఒడిశాలో శుక్రవారం జరిగింది. అయితే.. ఆ శిశువును కుక్కలు పీక్కుతిన్నాయి. ఇది చూసివ వారు అయ్యే పాపం అనకుండా ఉండలేకపోయారు. అసలే పిల్లలులేక కొందరు నానా కష్టాలు పడుతుండగా..శిశువును చెత్త కుప్పలో పడేయడం దారుణమని చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలకే పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్ప వద్ద కుక్కలు నెలలు నిండని పసికందును పీక్కుతింటున్న దృశ్యాలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ పసికందు మృతదేహాన్ని జిల్లా హస్పిటల్ కు తరలించారు. కుక్కలను తరిమికొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు పోలీసులు.