కొట్టొద్దని వారిస్తున్న పోలీసు ఎదుటే చితక్కొట్టిన యువకులు

V6 Velugu Posted on Sep 12, 2021

  • ఒంగోలు శివారు మంగమూరు రోడ్డులో స్ట్రీట్ ఫైట్ 
  • సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్

ప్రకాశం జిల్లా: అరడజనుకుపైగా యువకులు ఓ యువకుడ్ని దొరికిచ్చుకుని విచక్షణా రహితంగా చితక్కొట్టారు. కానిస్టేబుల్ కొట్టొద్దని వారిస్తున్నా పట్టించుకోకుండా కసితీరా కొట్టారు. కాలితో ఒకడు తంతే..  కర్రతో మరొకడు బడితెపూజ.. ఇంకొకడు పిడికిలి బిగించి పిడిగుద్దులు.. ముష్టి ఘాతాలతో యువకుడ్ని చితకబాదారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు శివారు మంగమూరు రోడ్డులో జరిగిన ఈ స్ట్రీట్ ఫైట్ ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. పట్టపగలు జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.
ఒంగోలు పట్టణంలోని కబాడీపాలెంకు చెందిన కొంతమంది యువకులు కలిసి ఓ యువకుడిని విచక్షణారహితంగా కొడుతున్న ఈ స్ట్రీట్ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. చిన్న వివాదం ఇరు వర్గాల మధ్య కోట్లాటకు దారితీసినట్లు స్థానికుల కథనం. నడిరోడ్డుపైనే ఓ యువకుడ్ని మరో వర్గానికి చెందిన యువకులు చితకబాదారు. విచక్షణారహితంగా కర్రలు, రాడ్లతో కొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్.. వద్దని వారిస్తున్నా లెక్క చేయని యువకులు.. కసిదీరా యువకుడిని చితక్కొట్టారు. కబాడీపాలెంకు చెందిన కొంతమంది వ్యక్తులు మధ్య ఓ కారు కొనుగోలు విషయంలో వివాదం చెలరేగినట్లు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 
 

Tagged Amaravati, prakasham District, ap today, , Ongole street fight, ongole outskirts, mangamur road street fight, car purchase issue, two groups of local

Latest Videos

Subscribe Now

More News