లాక్ డౌన్ లో స్ట్రెస్ ను త‌గ్గించుకోండిలా..!

లాక్ డౌన్ లో స్ట్రెస్ ను త‌గ్గించుకోండిలా..!

కరోనా వైరస్ మన జీవితాల్లోకి ఊహించని మార్పులు తీసుకు వచ్చేసింది. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నాం. ఆఫీస్ లేదు. ఫ్రెండ్స్ ని కలవడానికి లేదు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ఉద్యోగం ఏమవుతుందో! జీతం సరిగ్గా వస్తుందో రాదో. ఇంట్లో పెద్ద వాళ్లకు ఏమవుతుందో. హోమ్ మేకర్స్ కి రోజు రోజుకీ పెరిగిపోతున్న పని ఎప్పుడు తగ్గుతుందో. ఒకటా రెండా… వీటికి తోడు.. ఒకవేళ ఆ కరోనా వైరస్ మనకు వస్తే? ఇది ఇంకా భయపెట్టేది. ఈ భయాలన్నీ మీద వేసుకోవడం వల్ల మనలో స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. స్ట్రెస్ పెరిగినట్టు అన్నిటికంటే ముందుగా తెలిసేది మన స్కిన్ ద్వారానే.

ఎలా తెలుస్తుంది?

మామూలుగా మనకు స్ట్రెస్ పెరిగితే బీపీ తగ్గడమో, పెరగడమో జరుగుతుంది. అది మన కంటికి కనిపిస్తుంది. సరిగ్గా అలాగే స్ట్రెస్ పెరిగింది అంటే చాలు.. అది స్కిన్ ద్వారానే తెలిసిపోతుంది. స్ట్రెస్ పెరిగితే కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్.. ముఖం మీద మొటిమలు వస్తాయి. అంతకుముందే ఏవైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్, డార్క్ స్పాట్స్ వచ్చేస్తాయి. జుట్టు ఊడిపోతుంది, తెల్లబడిపోతుంది. చర్మం మీద ముడతలు పడతాయి. వయసు మీద పడ్డట్టు తయారవుతారు. స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది. ఇవన్నీ స్ట్రెస్ పెరిగితే అది చర్మం మీద చూపించే ఎఫెక్ట్ లే.

మరేం చేయాలి..?

*స్ట్రెస్ బారిన పడకుండా ఉండటమే చేయాల్సింది. అన్ని భయాలను వదిలేసి ప్రశాంతంగా ఉండాలి.
*8 గంటల పాటు మంచి నిద్ర అవసరం.
*యోగా, మెడిటేషన్ లాంటివి తప్పనిసరిగా చేయాలి.
*మంచి పుస్తకం చదువుకోవచ్చు, లేదా నచ్చిన పని ఏదైనా చేయొచ్చు.
*ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి సరదాగా మాట్లాడొచ్చు.
*జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. పండ్లు, ఆకుకూరలతో మంచి డైట్ ఫాలో అవ్వాలి.