
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అనుమతి లేకుండా హాస్పిటల్స్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎల్. భాస్కర్ హెచ్చరించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌లోని డీఎంహెచ్ఓ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్చట్టం ప్రకారం ఎవరికి మినహాయింపు ఉండదన్నారు.
ప్రతి ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అగ్నిమాపక భద్రత ఆడిట్‌లు నిర్వహించనున్నట్టు తెలిపారు. అర్హత లేని డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పనిచేసే హాస్పటల్స్పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ చైతన్య, ప్రోగ్రాం ఆఫీసర్లు మధువరన్, పుల్లారెడ్డి, తేజశ్రీ, డిప్యూటీ డెమో మహ్మద్ ఫైజుద్దీన్ పాల్గొన్నారు.