సోషల్ మీడియా స్క్రూ టైట్ చేస్తున్నరు

సోషల్ మీడియా స్క్రూ టైట్ చేస్తున్నరు
  • త్వరలో మార్గదర్శకాలు విడుదల
  • ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గనందుకే

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌‌డీఐలు) నియమాలను కట్టుదిట్టం చేసి అమెరికన్‌‌ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్‌‌, ఫ్లిప్‌ కా ర్ట్‌‌లకు షాకిచ్చిన నరేం ద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు అమెరికా సోషల్‌‌ మీడియా కంపెనీలపై దృష్టి సారించిం ది. ఫేస్‌‌బుక్‌‌తోపాటు వాట్సాప్‌, ట్విటర్‌‌పై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. గోప్యత నిబంధనలను మార్చడానికి ఇవి అంగీకరించకపోవడంతో ఆగ్రహం చెందిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుం ది. వాట్సాప్‌ ద్వారా విద్వేషపు మెసేజ్‌ లు, అశ్లీల వీడియోలు విచ్చలవిడిగా వ్యాపిస్తున్నాయని ప్రభుత్వం ఆక్షేపిస్తోంది. ఇలాంటి వాటిని నిరోధించడానికి అన్ని వాట్సాప్‌ సందేశాలపై
నిఘాకు అనుమతిం చాలని ఒత్తిడి పెం చుతోంది. ఫేస్‌‌బుక్‌‌ ఇది వరకే నిఘా ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే మూసివేయించే పరిస్థితికి కూడా దారితీయవచ్చని టెక్నాలజీ రంగ నిపుణులు అంటున్నారు.
ఎన్‌‌క్రిప్షన్ టెక్నాలజీ వల్లే విభేదాలు
ఈ విషయమై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌‌, ఐటీశాఖ సీనియర్ అధికారి గోపాలకృష్ణన్‌‌ మాట్లాడుతూ ‘‘వాట్సాప్‌ మరింత జవాబుదారీగా ఉండాలని ఆరు నెలలుగా ఆ సంస్థకు చెబుతున్నాం. మెసేజ్‌లు మేం చూసేందుకు అనుమతించాలని కోరినా వాళ్లు పట్టిం చుకోలేదు. చైల్డ్‌‌ పోర్నోగ్రఫీని వ్యాప్తిచేసే వాళ్లు వాట్సాప్‌ తమకు అనువైనదని అనుకోరా? వాట్సాప్‌ సహకరించకపోతే ఇలాంటి వారిని ఎలా పట్టుకుంటాం?’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాట్సాప్‌ వాదన మాత్రం వేరేలా ఉంది. ప్రభుత్వ ఆదేశాలు తమ గోప్యతా నియమాలకు పూర్తి విరుద్ధమని కంపెనీ అధికా ర ప్రతినిధి కార్ల్‌‌ వూగ్‌‌ అన్నారు. ‘‘మేం ఎండ్‌‌ టు ఎండ్‌‌ ఎన్‌‌క్రిప్షన్
విధానంలో మెసేజింగ్‌‌ సేవలు అందిస్తున్నాం . ఈ విధానాన్ని మార్చడం చాలా కష్టం ’’ అని  అన్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలు ఫార్వర్డ్‌‌ చేసే వారి పై అత్యం త కఠినంగా వ్యవహరిస్తున్నామని, ప్రతి నెలా 2.5 లక్షల అకౌంట్లను బ్లాక్‌‌ చేస్తున్నామని చెప్పారు.
ఫేస్‌‌బుక్‌‌ కూడా మెసేజింగ్‌‌కు ఎండ్‌‌ టు ఎండ్‌‌ సబ్‌ స్క్రిప్షన్ వాడనుంది. అంటే యూజర్లు పంపే సందేశాలను ఫేస్‌‌బుక్‌‌ యాజమాన్యం కూడా చూడటం సాధ్యం కాదు. ఇన్‌‌స్టా గ్రామ్‌కు కూడా వచ్చే ఏడాది ఇదే విధానాన్ని ప్రవేశపెడతామని చెబుతోంది. ఈ టెక్నాలజీ వల్ల పోలీసులు ఫేస్‌‌బుక్‌‌, వాట్సాప్‌ యూజర్లపై నిఘా వేయడం దాదాపు అసాధ్యం.
ఇండియా మార్కెట్‌ కీలకం
ఫేస్‌‌బుక్‌‌ వంటి సోషల్‌‌ మీడియా కంపెనీలకు ఇండియా మార్కెట్‌‌ చాలా ముఖ్యమైనది. దశాబ్దం
క్రితం మనదేశంలో ఆన్‌‌లైన్‌‌ జనాభా కేవలం 7.1 లక్షల మంది కాగా, ఇప్పుడు అది 48 కోట్ల మందికి పెరిగిం ది. 2022 నాటికి ఇది 73 కోట్లకు చేరుతుందని అంచనా. అందుకే అమెజాన్‌‌, ఫేస్‌‌బుక్‌‌, ట్విటర్ మైక్రోసాఫ్ట్‌‌ వంటి కంపెనీలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వీటికి పగ్గాలు వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ వంటి పార్టీలపై ట్విటర్ వివక్ష చూపుతుందన్న ఆరోపణల నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకునే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ విషయమై విచారణ కోసం ఈ నెల 25న తమ ఎదుట హాజరు
కావాలని పార్లమెం టు కమిటీ ట్విటర్‌‌ సీఈఓ జాక్‌‌ డోర్సీని ఆదేశించింది.

ఇదిలా ఉంటే, చిన్నారులను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నట్టు గత ఏడాది వాట్సాప్‌ లో పుకార్లు రావడంతో 20కిపైగా మంది అమాయకులను కొట్టి చంపారు. నష్ట నివారణకు వాట్సాప్‌ చేసిన ప్రయత్నాలపై ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. మెసేజ్‌లను ముగ్గురికి మించి ఫార్వర్డ్‌‌ చేయకుండా వాట్సాప్‌ కట్టడి చేసిం ది. అన్ని మెసేజ్‌లను తాము చూడగలిగేలా చేయాలని భద్రతా సంస్థలు వాట్సాప్‌ ను కోరుతున్నాయి. ‘‘ఎయిర్‌‌టెల్‌‌, జియో, బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ వంటి కంపెనీలు కాల్‌‌రికార్ డులను భద్రపర్చాలన్న ఆదేశాలను పాటిస్తున్నాయి. వాట్సాప్‌కు ఈ విషయంలో మినహాయింపు ఎందుకు ఇవ్వాలి? నేరాలకు దారి తీసే మెసేజ్‌ ల గురించి మాకు తెలియకూడదా’’ అని గోపాలకృష్ణన్‌‌ ప్రశ్నిం చారు.

కొత్త రూల్స్‌‌తో సోషల్‌ మీడియా కంపెనీలకు ఇబ్బందే
1. వాట్సప్, ఫేస్‌ బుక్‌ , ట్విటర్‌ వంటి సంస్థలను నియంత్రించడానికి మోడీ ప్రభుత్వం ‘మధ్యంతర మార్గదర్శకాల’ను తయారు చేసింది.
2. వీటి ప్రకారం యూజర్లు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ ను పంపితే సంబంధిత మీడియా
సంస్థలే బాధ్యత వహించాలి.
3. అభ్యంతరకర మెసేజ్‌ ఎవరు పంపించారో గుర్తించి, 24 గంటల్లోపు తొలగించాలి.
4. ఇలాంటి కేసులపై దర్యాప్తు చేసే సంస్థలకు సహకరించాలి.
5. కొన్ని వారాల్లోపే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి.