కోల్బెల్ట్, వెలుగు: దివ్యాంగులకు ప్రత్యేక రక్షణ సదుపాయాలను కల్పించేందుకు రూపొందించిన దివ్యాంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ కోరారు. సోమవారం రామగుండం పోలీస్కమిషనర్అంబర్కిశోర్ ఝాను దివ్యాంగులతో కలిసి తమకు చట్టపరమైన హక్కులను వర్తింపజేయాలని వినతిపత్రం అందజేశారు.
దివ్యాంగుల చట్టం 2016 సెక్షన్ 91(ఏ)91(బి)ప్రకారం వికలాంగులను దూషించినా, దాడి చేసిన కేసు నమోదు చేయాలని కోరారు. పోలీస్, న్యాయ శాఖలు, ఇతర సంబంధిత శాఖల నుంచి ప్రత్యేక రక్షణ సదుపాయాలు వర్తింపచేయాలన్నారు.
వికలాంగుల సౌకర్యార్థం అన్ని పోలీస్ స్టేషన్లు, ఆఫీసుల్లో వీల్ చైర్స్, ర్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. వికలాంగుల చట్టంపై జిల్లాలో అవగాహన సదస్సులు అవగాహన కల్పించాలని కోరారు. వీహెచ్పీఎస్జిల్లా కన్వీనర్బీవీ అప్పారావు, లీడర్లు ఇందూరి రమేశ్, కంచర్ల సదానందం, దురిశెట్టి లక్ష్మణ్, మడావి షేక్రావు, దివ్యాంగులు పాల్గొన్నారు.
