గురుకులంలో స్టూడెంట్‌‌కు పాముకాటు

గురుకులంలో స్టూడెంట్‌‌కు పాముకాటు

సుల్తానాబాద్, వెలుగు : పెద్డపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌ మున్సిపాలిటీ పరిధిలోని శాస్త్రి నగర్‌‌లో గల సోషల్‌‌ వెల్ఫేర్‌‌ బాయ్స్‌‌ గురుకులంలో ఓ స్టూడెంట్‌‌ను పాముకాటు వేసింది. జూలపల్లి మండలం కాచాపూర్‌‌ గ్రామానికి చెందిన బి. మన్విత్‌‌ సుల్తానాబాద్‌‌లోని గురుకులంలో ఉంటూ ఆరో తరగతి చదువుతున్నాడు. 

బుధవారం మధ్యాహ్నం టాయ్‌‌లెట్‌‌కు వెళ్లగా మన్విత్‌‌ను పాము కాటు వేసింది. గమనించిన మిగతా స్టూడెంట్లు కేకలు వేయడంతో హాస్టల్‌‌ సిబ్బంది వచ్చి మన్విత్‌‌ను సుల్తానాబాద్‌‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఫస్ట్‌‌ ఎయిడ్‌‌ చేసిన అనంతరం మెరుగైన ట్రీట్‌‌మెంట్‌‌ కోసం కరీంనగర్‌‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్విత్‌‌ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు హాస్పిటల్‌‌కు చేరుకున్నారు. స్టూడెంట్‌‌ మన్విత్‌‌ పరిస్థితి నిలకడగా ఉందని గురుకులం ప్రిన్సిపాల్‌‌ దేవేందర్‌‌రెడ్డి చెప్పారు.