
- స్టూడెంట్‌పై కేసు
జూబ్లీహిల్స్, వెలుగు: రామానాయుడు ఫిలిం స్కూల్మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన స్టూడెంట్‌పై కేసు నమోదు చేసినట్లు ఫిలింనగర్పోలీసులు ఆదివారం తెలిపారు. ఫిలిం స్కూల్లో భరత్‌రెడ్డి డైరెక్షన్ కోర్సు చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ తోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో మహిళా ప్రొఫెసర్ ను ఫాలో అవుతూ వివిధ రకాల కామెంట్లు పెట్టాడు.
అంతేకాకుండా శిక్షణనిచ్చే సమయంలోనూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయగా భరత్ రెడ్డిని స్కూల్నుంచి పంపించారు. మహిళా ప్రొఫెసర్ఫిర్యాదు మేరకు భరత్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.