విద్యార్థులు క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చు : వివేక్ వెంకటస్వామి

 విద్యార్థులు క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చు  : వివేక్ వెంకటస్వామి

విద్యార్థులు క్రమశిక్షణ నేర్చుకోవాలని దానితో ఏదైనా సాధించవచ్చునని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.  మందమర్రి పట్టణంలో కార్మెల్ స్కూల్ అకాడమీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్  కు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామికి విద్యార్థులు, స్కూల్ సిబ్బంది స్వాగతం పలికారు. 

60 సంవత్సరాలుగా కార్మెల్ స్కూల్ నడవడం చాలా గొప్ప విషయమన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ స్కూల్ లో చదువుకున్న విద్యార్థులు చాలా ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారని చెప్పారు.  కార్మెల్ స్కూల్ యాజమాన్యం వెలుగు  విద్య ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా విద్య ను అందించడం చాలా గొప్ప విషయమన్నారు.  

వెలుగు  విద్య కోసం ఎమ్మెల్యే గా తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అని చెప్పిన వివేక్...  ఇటీవల శతాబ్థి  ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయ్యానన్నారు.