
- తక్కువ కాలంలోనే జాబ్స్
- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడి
కోల్‌బెల్ట్, వెలుగు: విద్యార్థుల్లో స్కిల్స్ పెంపునకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ) దోహదం చేస్తాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. స్కిల్స్ ఉంటేనే జాబ్ ల్లో ప్రతి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని, డిగ్రీ కంటే స్కిల్స్ద్వారానే త్వరగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో రాష్ట్ర ప్రభుత్వం,టాటా గ్రూప్ సౌజన్యంతో ఏర్పాటైన ఏటీసీ సెంటర్‌ను, మంచిర్యాల కలెక్టరేట్లో తెలంగాణ అకాడమీ ఫర్స్కిల్ అండ్నాలెడ్జ్శిక్షణ(టాస్క్) సెంటర్ ను ఆయన సందర్శించారు.
ఆయా కేంద్రాల్లో స్టూడెంట్లకు అందిస్తున్న కోర్సులు, ట్రైనింగ్, ఫెసిలిటీలను కలెక్టర్కుమార్దీపక్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు, నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. యూనిట్ల వద్దకు వెళ్లి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. టెక్నాలజీ డెవలప్మెంట్ఎంతో స్పీడ్‌గా వెళ్తుందని, దాన్ని అధిగమించే స్కిల్‌ను యువతలో కల్పించేందుకు టాటా టెక్నాలజీస్లిమిటెడ్సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
టెన్త్ పాసై ఇంటర్, డిగ్రీ, బీటెక్ వంటి చదువులు చదువుకోలేని స్టూడెంట్లకు ఏటీసీ సెంటర్ ద్వారా తక్కువ కాలంలోనే జాబ్స్వస్తాయన్నారు. గ్రామీణ యువతకు శిక్షణ అందించడంలో వీటిది కీ రోల్అన్నారు. మంచిర్యాల జిల్లాలో 4 ఏటీసీ సెంటర్ల ద్వారా ఏటా 1000 మందికి జాబ్స్లభిస్తాయన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీగా భావిస్తున్న ఎలక్ట్రికల్వెహికల్, ఎలక్రటికల్సైకిల్ తయారీ, సీఎన్సీ మిషన్, లేజర్ కట్టింగ్మిషన్, పీఎల్సీ టెక్నాలజీ తో యంత్రాలను నడపడంపై ట్రైనింగ్ఇవ్వడం గొప్పగా ఉందన్నారు. ఏటా 174 మందికి శిక్షణ ఇస్తూ టాటా సంస్థనే జాబ్స్కల్పిస్తుందని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి ఉంటుందని, మరిన్ని కోర్సుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన చెప్పారు. విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మందమర్రి ఏటీసీ సెంటర్ఆవరణలో కలెక్టర్‌తో కలిసి ఎంపీ మొక్కలు నాటారు. అనంతరం ఎంపీ మందమర్రిలోని లెదర్ పార్క్‌ను పరిశీలించారు.
ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లెదర్‌పార్క్ కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పార్కు నిర్వహణ ఉందని, ఫండ్స్ఇప్పించి పార్కు నడిచేలా కృషి చేయాలని పలువురు ఎంపీని కోరారు. లెదర్ పార్క్పునరుద్దరణకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్లో టెన్త్, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్టూడెంట్లను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన ఆఫీసర్రవికృష్ణ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, టాస్క్ప్రతినిధి సాయికృష్ణ, మందమర్రి తహసీల్దార్సతీశ్, ఎంపీడీవో రాజేశ్వర్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.