ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు రూ. 10లకే వర్క్‌బుక్

ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు రూ. 10లకే వర్క్‌బుక్

కరోనావైరస్ కారణంగా విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయి. లాక్‌డౌన్, కరోనా కారణంగా స్కూళ్లన్నీ మూతపడటంతో.. టీచింగ్ మొత్తం ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. దాంతో విద్యార్థులందరూ ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. అయితే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని grade1to6.com అనే వెబ్‌సైట్ పాఠ్యపుస్తకాలను పీడీఎఫ్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మరియు గణిత శాస్త్రానికి సంబంధించిన వర్క్‌బుక్‌లను పీడీఎఫ్ రూపంలో పొందుపరిచి వెబ్‌సైట్‌లో పెట్టింది. సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్టీ, ఎస్‌సీఈఆర్టీలకు సంబంధించి 1 నుంచి 12వ తరగతి వరకు అవసరమైన పుస్తకాలను సిద్ధం చేసింది. ఈ పుస్తకాలను భారతదేశంలోని అన్ని సీబీఎస్ఈ, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఉపయోగించుకోవచ్చు. ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్‌లో బేసిక్స్‌పై విద్యార్థులకు పట్టు పెంచడం మీద ఈ పుస్తకాలలో దృష్టిపెట్టారు. 

ఈ పుస్తకాలు 100 నుంచి 200 పేజీలలో పీడీఎఫ్ రూపంలో పొందుపరిచారు. ఒక్కో పుస్తకాన్ని కేవలం 10 రూపాయలకు కొనుగోలు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో 7వ తరగతి వరకు వర్క్‌బుక్‌లను అందుబాటులో ఉంచారు. త్వరలోనే 12వ తరగతి వరకు వర్క్‌బుక్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇలా చేయడం వల్ల పేదవారి పిల్లలకు మరియు ధనవంతుల పిల్లలకు ఒకే రకమైన విద్యను అందించవచ్చనేది వెబ్‌సైట్ యొక్క లక్ష్యం. శ్రీమతి లక్ష్మీ అన్నపూర్ణ చింతలూరి నేతృత్వంలోని అనుభవజ్ఞులైన బోధనా నిపుణుల బృందం ఈ వర్క్‌బుక్‌ల కోసం పర్యవేక్షిస్తుంది. పాఠ్యాంశాల ఎడిటింగ్ మరియు కంటెంట్ రైటింగ్‌ను ఈ బృందం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది.

ఈ పుస్తకాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
పీడీఎఫ్ రూపంలో ఉండే వర్క్‌బుక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి https://www.grade1to6.com/class1to12/కు లాగిన్ అవ్వాలి. అందులో మీ పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ వంటి ప్రాథమిక వివరాలను నింపాలి. ఆ తర్వాత మీకు కావలసిన బుక్‌ను సెలక్ట్ చేసుకొని.. పేమెంట్ చేయాలి. అప్పుడు మీ మెయిల్‌కు ఒక లింక్ పంపబడుతుంది. ఆ లింక్ ద్వారా మీ పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. తద్వారా మీ పిల్లలకు వర్క్‌బుక్ అందుబాటులోకి వస్తుంది. కేవలం రూ. 10లతోనే మీ పిల్లలకు కావలసిన పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కాని, మీ చుట్టు పక్కల కానీ పనిచేసుకునే వారి పిల్లలకు కూడా మీరు కేవలం పది రూపాయలతో పుస్తకాన్ని అందించి.. చదువుకోవడానికి సాయపడవచ్చు. ఈ వర్క్‌బుక్‌లకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెబ్‌సైట్ ఫౌండర్, సీఈఓ బాలాజీని వెబ్‌సైట్ లేదా +91 9811804322 ద్వారా సంప్రదించవచ్చు.