శాతవాహన యూనివర్సిటీ ముట్టడి

శాతవాహన యూనివర్సిటీ ముట్టడి
  • పోలీసులకు, స్టూడెంట్లకు  మధ్య తోపులాట
  • సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

కరీంనగర్ టౌన్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం నిరసన చేపట్టారు.  యూనివర్సిటీ లీడర్  జెల్లపల్లి అంజయ్య, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మల్యాల రాకేశ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేశారు.  ఎగ్జామినేషన్ బ్రాంచిలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి, దోషులను శిక్షించాలన్నారు. పీహెచ్‌‌డీ అవకాశం కల్పిస్తూ  వృత్తి కోర్సులను  ప్రవేశపెట్టాలని కోరారు.  ఖాళీగా ఉన్న  టీచింగ్,నాన్  టీచింగ్ స్టాఫ్​ ను వెంటనే  నియమించాలని డిమాండ్  చేశారు. నూతన కోర్సులను ప్రవేశపెట్టి, విద్యార్థులకు మెరుగైన హాస్టల్ వసతిని కల్పించాలన్నారు.  

యూనివర్సిటీలోకి ప్రవేశించేందుకు  స్టూడెంట్లు ఒక  దశలో గేట్లు ఎక్కడంతో పోలీసులకు,  స్టూడెంట్లకు మధ్య  తోపులాట  జరిగింది.  అనంతరం స్టూడెంట్లను పోలీసులు అడ్డుకుని స్టేషన్లకు తరలించారు.  కార్యక్రమంలో  విభాగ్ కన్వీనర్ అజయ్,రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ రంజిత్ , జిల్లా కన్వీనర్లు పూసాల విష్ణు, మాడవేణి సునీల్, బండి రాజశేఖర్, సామలపల్లి ప్రశాంత్, నందు, రాజు, సిద్ధార్థ, వరుణ్, హాస్టల్ కన్వీనర్ రాసూరి ప్రవీణ్,విగ్నేష్, అనిల్, విష్ణు,మనీషా,అలేఖ్య, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.