టెన్త్ లో 99.38%, 12 వ తరగతిలో 97.13% పాస్

టెన్త్ లో  99.38%, 12 వ తరగతిలో 97.13% పాస్

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) టెన్త్, 12వ తరగతి ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ పాస్ పర్సంటేజీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం లీడ్​లో నిలిచింది. టెన్త్​లో మొత్తం 35,015 మంది రిజిస్టర్ ​చేసుకొని 34,908 మంది పరీక్ష రాయగా, 34,696 మంది పాసయ్యారు. వీరిలో 19,168 మంది బాయ్స్, 15,528 మంది గర్ల్స్​ ఉన్నారు. టెన్త్​లో నేషనల్ పాస్ పర్సంటేజీ 94.40% ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 99.38% నమోదైంది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో వంద శాతం స్టూడెంట్లు పాస్ కాగా.. ప్రైవేటు స్కూళ్లలో 99.33 శాతం, కేంద్రీయ విద్యాలయాల్లో 99.84 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక12వ తరగతిలో (ఇంటర్​) మొత్తం 7,964 మంది రిజిస్టర్ చేసుకొని 7,936 మంది పరీక్ష రాయగా, 7,708 మంది పాసయ్యారు. నేషనల్ యావరేజీ 92.71 శాతం ఉండగా, రాష్ట్రంలో 97.13 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రైవేటు స్కూళ్లలో 96.43 శాతం, జవహర్ నవోదయ స్కూళ్లలో 99.05 శాతం, కేంద్రీయ విద్యాలయాల్లో 99.30 శాతం స్టూడెంట్లు పాసయ్యారు.

12లో నేషనల్ పర్సంటేజీ 92.71 శాతం 
సీబీఎస్​12వ క్లాస్​లో నిరుడు నేషనల్​పాస్​పర్సంటేజీ 99.37 శాతం కాగా.. ఈసారి 92.71 శాతంగా రికార్డయింది. ఈసారి 12వ తరగతిలో అమ్మాయిలు 94.54 శాతం, అబ్బాయిలు 91.25 శాతం, ట్రాన్స్ జెండర్లు 100 శాతం పాసయ్యారు. జవహర్​ నవోదయ విద్యాలయాలు 98.93 శాతం, సెంట్రల్​టిబెటిన్​స్కూల్స్​అడ్మినిస్ట్రేషన్​97.96 శాతం, కేంద్రీయ విద్యాలయాలు 97.04 శాతం ఉత్తర్ణీత సాధించాయి. ఇక సీబీఎస్​ఈ టెన్త్​ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 94.4 శాతం మంది స్టూడెంట్లు పాసయ్యారు. నిరుడు ఆల్టర్నేటివ్​ అసెస్​మెంట్​ఆధారంగా 99.04 శాతం మంది పాసయ్యారు. ఈసారి అమ్మాయిలు 95.21 శాతం, అబ్బాయిలు 93.8 శాతం, ట్రాన్స్​జెండర్లు 90 శాతం పాస్​ అయినట్లు బోర్డు వెల్లడించింది. జవహర్​నవోదయ విద్యాలయాలు 99.71 శాతం, ప్రైవేట్​ స్కూళ్లు 96.86 శాతం, కేంద్రీయ విద్యాలయాలు 96.61 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 

మరిన్ని విజయాలు అందుకోవాలి : ప్రధాని మోడీ
సీబీఎస్​ఈ  12వ తరగతిలో పాసైన స్టూడెంట్లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కరోనా వంటి పరిస్థితులను ఎదుర్కొని కష్టపడి చదివి స్టూడెంట్లు ఈ విజయాన్ని అందుకున్నారని ఆయన ట్వీట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.