బడికి రాకపోతే .. బ్యాండ్​ బజాయిస్తరు!

బడికి రాకపోతే ..  బ్యాండ్​ బజాయిస్తరు!

హన్వాడ, వెలుగు : ఆ ఊళ్లో ఏ కారణం లేకుండా స్కూల్​కు డుమ్మా కొట్టి ఇంటికాడ ఉందామంటే కుదరదు. బడి ఎగ్గొడదామని ఫిక్సయితే ఇంటి ముందు బ్యాండ్​సప్పుడు వినడానికి సిద్ధంగా ఉండాలె. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లిలోని ప్రైమరీ స్కూల్ లో 82 మంది స్టూడెంట్స్​చదువుతున్నారు. కొందరు విద్యార్థులు ఏ కారణం లేకుండా స్కూల్ కు డుమ్మా కొడుతున్నారు. పొలం పనులకు వెళ్లే తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడం లేదు. దీంతో స్కూల్ టీచర్ అర్జున్, రిటైర్డ్​ఆర్మీ ఉద్యోగి రఘురాంగౌడ్ ఒక ఉపాయం చేశారు. స్కూల్​పిల్లలతో ఒక బ్యాండ్​ఏర్పాటు చేయించి బడికి రాని విద్యార్థుల ఇండ్లకు వెళ్లి బజాయిస్తున్నారు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. స్కూల్​ఎగ్గొట్టే వారి సంఖ్య కూడా తగ్గింది. బుధవారం కూడా ఇలాగే స్కూల్​కు రాని స్టూడెంట్​ఇంటికి వెళ్లి బ్యాండ్​మోగించారు. దీంతో సదరు విద్యార్థి వెంటనే బ్యాగ్​సర్ధుకుని బడి బాట పట్టాడు. దీంతో మంచి ఐడియాతో పిల్లలు బడి మానకుండా చేస్తున్నారని టీచర్​అర్జున్​, రిటైర్డ్​ ఆర్మీ ఎంప్లాయ్​రఘురాంను గ్రామస్తులు అభినందిస్తున్నారు.