అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థుల నిరసన

అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థుల నిరసన
  •   వార్డెన్​ శోభ సస్పెన్షన్ 

పుల్కల్​, వెలుగు:  సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం బొమ్మా రెడ్డిగూడెం గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ లో శుక్రవారం అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్​ ముందు మెనూ చార్ట్​ పట్టుకొని ఆందోళన నిర్వహించారు. మెనూ ప్రకారం  భోజనం పెట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకొని జిల్లా అధికారులు హాస్టల్​కు వెళ్లి పరిశీలించారు. హాస్టల్​లో 220 మంది  స్టూడెంట్స్​ ఉండగా 3 కిలోలు కందిపప్పు, రెండు కిలోల పెరుగు ప్యాకెట్లతో సరిపుచ్చుతున్నారని విద్యార్థులు అధికారులకు విన్నవించారు. 

చపాతీ స్వయంగా తామే చేసుకుంటున్నట్లు చెప్పారు. అధికారులు తనిఖీకి వచ్చిన ఆ ఒక్క రోజు మాత్రమే  మంచి భోజనం పెడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. వాష్​రూమ్​లు సరిగా లేవని అసహనం వ్యక్తం చేశారు. నూతన వాష్​రూమ్​లు  ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపడుతామని ట్రైబల్​ వెల్పేర్​అధికారి ​అఖిలేశ్​రెడ్డి చెప్పారు. ఆయన వెంట మండల స్పెషల్ ఆఫీసర్​ వసంతకుమారి, ఎంపీడీవో శంకర్ ఉన్నారు. వార్డెన్​ సస్పెన్షన్ బొమ్మా రెడ్డిగూడెం గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ వార్డెన్ శోభ విధుల పట్ల నిర్లక్ష్యం చేయడంతో కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ట్రైబల్​వెల్పేర్​అధికారి అఖిలేశ్​రెడ్డి తెలిపారు.