రోడ్డుపై చికెన్ బిర్యానీతో ధర్నా

రోడ్డుపై చికెన్ బిర్యానీతో ధర్నా

ఆదిలాబాద్ జిల్లా బేలా అంబేద్కర్ చౌక్‭లో విద్యార్థులు ధర్నా చేపట్టారు. హాస్టల్‭లో పెట్టే నాసిరకం భోజనం తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి సమయంలో రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేశారు. వండిన చికెన్ బిర్యానీని జాతీయ రహదారి పై పెట్టి నిరసన తెలియజేశారు. వెంటనే వార్డెన్‭ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. మాకొద్దు నాసిరకం భోజనం అంటూ ఆందోళన నిర్వహించారు. మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. అసలు అది చూస్తే తినాలని అనిపించడం లేదని ఆవేదన చెందారు. 

ఇక విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ నేతలు మద్దతు తెలిపారు. విద్యార్థులకు వేరే భోజనం ఏర్పాటు చేసి.. అనంతరం వారితో పాటు ఏబీవీపీ నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. చివరికి పోలీసుల హామీతో విద్యార్థులు ధర్నా విరమించారు.