విద్యార్థులారా.. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు: అమిత్ షా

విద్యార్థులారా.. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు: అమిత్ షా

పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థులెవరూ ఆ పార్టీల ట్రాప్‌లో పడొద్దని కోరారు. సోమవారం జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోరేయాహట్‌లో జరిగిన బీజేపీ సభలో ఆయన మాట్లాడారు.

దేశ వ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలపై స్పందించిన ఆయన.. ఆ చట్టాన్ని పూర్తిగా చదవాల్సిందిగా స్టూడెంట్స్‌ని కోరారు. కొత్త చట్టం ప్రకారం ఏ ఒక్క భారతీయుడి పౌరసత్వం తీయడం అన్నది జరగదని చెప్పారు అమిత్ షా. పొరుగు దేశాల్లో మత హింసను ఎదుర్కొంటూ భారత్‌కు శరణార్థులుగా వచ్చిన వారి కోసమే చట్ట సవరణ చేశామని తెలిపారు. కానీ, కొన్ని రాజకీయ పార్టీలు వాటి స్వార్థం కోసం అవాస్తవాలను ప్రచారం చేస్తూ హింసాత్మక ఘటనలకు కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలను నమ్మి తప్పుదారి పట్టొద్దని విద్యార్థులను కోరారు అమిత్ షా.