బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు

బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు

బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని NSUI ధర్నా చేసింది. బస్సుల లేక తాము నిత్యం నరకం అనుభవిస్తున్నామని విద్యార్థులు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఆర్టీసీ బస్టాండ్  ఆవరణలో ఆందోళన చేశారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుకునే స్టూడెంట్స్ ప్రతిరోజు  పలు గ్రామాల నుండి శంకర్ పల్లి పట్టణానికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పేద విద్యార్థులకు RTC బస్సు ప్రయాణం తప్ప ఇంకో మార్గం లేదు. సొంత వాహనాలు లేకపోవడం...అధిక ఛార్జీలు చెల్లించి పాఠశాలలు, కాలేజీలకు వెళ్లలేక కొందరు ఇంటికే పరిమితమవుతున్నారు. బస్సు పాస్ లు ఉన్నా..ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఆర్టీసీ బస్సుల కొరత, రూట్ పాసుల పరిమితుల ఆంక్షలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టూడెంట్స్ కు సరిపడా బస్సులు వెయ్యాలని.. రూట్ పాసులు కేవలం డిస్ట్రిక్ బస్సులకు మాత్రమే పరిమితం. కానీ కళాశాలలకు వెళ్లే సమయంలో ఖానాపూర్ నుండి శంకర్ పల్లి మధ్యన ఉన్న రూటులో డిస్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉండటం లేదు. అదే సమయంలో రూట్ పాసులు కలిగిన విద్యార్థులను సిటీ బస్సులలో అనుమతించడం లేదు. విద్యార్థుల ప్రయాణ సమస్యలను అర్థం చేసుకొని రూట్ పాసులు కలిగిన విద్యార్థులకు సిటీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. డిస్ట్రిక్ బస్సుల సర్వీసులను పెంచి ప్రయాణ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు అధికారులను అభ్యర్థించారు.