భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట జడ్పీ హైస్కూల్ స్టూడెంట్లు, టీచర్లు గురువారం ‘వృక్ష రక్షా బంధన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ఎకో క్లబ్, నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో రావి చెట్టుకు ఆకులు, పూలతో చేసిన రాఖీ కట్టారు. స్కూల్ హెచ్ఎం, ఎంఈవో ఉండేటి ఆనంద కుమార్ మాట్లాడుతూ వృక్షాలను కాపాడాలనే సందేశం ఇచ్చేందుకు ప్రతి ఏడాది చెట్లకు రాఖీలు కడుతున్నట్లు తెలిపారు.
