చదువు కోసం నిత్యం పోరాటం

చదువు కోసం నిత్యం పోరాటం

కూలి కోసం, కూటి కోసం బయలు దేరిన బాటసారికి ఎంత కష్టం అన్న తరహాలో విద్య కోసం, జ్ఞానం కోసం బయలుదేరిన చిన్నారులకు ఎంత కష్టం అనిపిస్తోంది ఈ వీడియో చూస్తే. అన్ని సౌకర్యాలున్నా చదువును లెక్కచేయని వాళ్లకు అదే చదువు కోసం ఈ విద్యార్థుల పడే యాతన... కచ్చితంగా స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల.. దాని కోసం ప్రమాదకర స్థితిని కూడా లెక్కచేయని వైనం... ఇవన్నీ చూస్తుంటే.. ఈ విద్యార్థులు అనుకున్న దాంట్లో సగం సాధించినట్టే తెలుస్తోంది. ఎందుకంటే కష్టం విలువ తెలిసినోడికి... ఫలితం కచ్చితంగా దక్కుతుంది.

చదువు కోసం ప్రమాదకర రీతిలో పడవలో ప్రయాణిస్తూ ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అస్సాంలోని నల్ బాడీ జిల్లాకు చెందిన విద్యార్థులు. రిస్క్ అని తెలిసినా... జీవితంలో అనుకున్నది సాధించేందుకు, విద్యా బుద్ధులు నేర్చుకునేందుకు సాహసం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు రోజూ ఒకే పడవలో విద్యార్థులంతా కలిసి నదిని దాటి వెళ్తున్నారు. ప్రమాదం అని ఈ సీన్ ను చూస్తేనే తెలుస్తుంది. అందులోనూ వెళ్తున్న వారంతా చిన్న పిల్లలే కావడం ఆందోళనను కలిగిస్తోంది. 

మరిన్ని వార్తల కోసం...

పుష్కర్ ధామి ఘన విజయం.. అభినందనలు తెలిపిన మోడీ

టెట్ తేదీ మార్చడానికి ఇబ్బందేంటి?