జంపింగ్​ జపాంగ్​..పాలోళ్ల కొట్లాట

జంపింగ్​ జపాంగ్​..పాలోళ్ల కొట్లాట

జంపింగ్​లో నేను గొప్పంటే నేను గొప్పన్నంత రేంజ్​లో ఎగిరి దునుకుతున్నయ్​ ఈ చిరుత పులులు. నువ్వెంతంటే నువ్వెంత అన్న రేంజ్​లో కొట్టుకున్నయి. ఇగో, చూడు నేనెట్ల దునుకుతనో అంటూ ఒకటి ఇంకో దాని మీదకు దునికేసింది. ఎగిరి దాని మీద నుంచి అవతలకు జంప్​ చేసింది. కెన్యాలోని సంబురు నేషనల్​ రిజర్వ్​లో కనిపించిన ఈ చిరుతల ఫైటింగ్​ను అమెరికా ఫొటోగ్రాఫర్​ త్రిస్​ హెన్నెస్సీ క్లిక్​మనిపించింది. ఈ రెండు పులులు అన్నదమ్ములట. మనుషులకేనా మాకూ ఉంటయి పాలోళ్ల గొడవలన్నట్టు కొట్టుకున్నట్టు లేదూ వీటి కొట్లాట.