కూసుమంచి: లారీ ఢీకొని ఎస్సై, డ్రైవర్‌‌‌‌కు తీవ్ర గాయాలు

కూసుమంచి: లారీ ఢీకొని ఎస్సై, డ్రైవర్‌‌‌‌కు తీవ్ర గాయాలు

కూసుమంచి, వెలుగు : లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎస్సై కూచిపూడి జగదీశ్, కారు డ్రైవర్‌‌‌‌ కొత్తపల్లి రాజేష్‌‌‌‌కు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం అర్ధరాత్రి తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పిండిప్రోలు గ్రామంలో వినాయక నిమజ్జనం విధులు ముగించుకుని పోలీసు వాహనంలో తిరుమలాయపాలెం పీఎస్​కు వస్తుండగా, భవానీ హోటల్‌‌‌‌ సమీపంలో ఎదురుగా వస్తున్న చేపల లోడ్‌‌‌‌ లారీ పోలీసు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నుంచి ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని గోరఖ్‌‌‌‌పూర్‌‌‌‌కు చేపల లోడ్‌‌‌‌తో వెళ్తున్న లారీని డ్రైవర్‌‌‌‌ షేక్‌‌‌‌ రసూల్‌‌‌‌ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన ఎస్సై జగదీశ్​ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్‌‌‌‌ రాజేశ్​ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌‌‌‌కు తరలించారు. లారీ డ్రైవర్‌‌‌‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ఖమ్మం సీపీ సునీల్‌‌‌‌దత్‌‌‌‌, రూరల్‌‌‌‌ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్‌‌‌‌ పరామర్శించారు.