ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో ఎస్సై కొడుకు..అభినందించిన కమిషనర్ 

ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో ఎస్సై కొడుకు..అభినందించిన కమిషనర్ 

వరంగల్, వెలుగు: పోలీస్ కమిషనర్ గ్రేటర్ వరంగల్ హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్‌ ఎసైగా పనిచేస్తున్న దామెరుప్పుల దేవేందర్‌ కొడుకు అక్షిత్‌ ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్‌ రాసిన ‘వేర్‌ ది మైండ్‌ ఈజ్‌ వితౌట్‌ ఫియర్‌’ రచనను ఏడు భాషలు తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలి, మరాఠి, ఇంగ్లీష్‌, స్పానిష్‌ లో 3.10 నిమిషాల పాటు అనర్గళంగా చెప్పి ఈ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో సంస్థ ఇటీవల అక్షిత్‌ పేరును ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ నమోదు చేసింది.

ఆ ధ్రువీకరణ పత్రాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా బుధవారం అక్షిత్‌కు అందజేశారు. అక్షిత్‌తో పాటు తల్లిదండ్రులు దేవేందర్‌, స్వప్న, మెంటర్‌ కోమనేని రఘును సీపీ అభినందించారు. కమిషనర్‌ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు బీజీగా ఉన్నా తమ పిల్లల అభ్యున్నతికి సమయం కేటాయిస్తూ వారిని ఉన్నత స్థానాల్లో నిలపడం అభినందనీయమన్నారు.