హరోం హర.. ఆసక్తిరేపుతున్న ఫస్ట్ ట్రిగ్గర్ వీడియో

హరోం హర.. ఆసక్తిరేపుతున్న ఫస్ట్ ట్రిగ్గర్ వీడియో

సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. ది రివోల్ట్ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. గురువారం సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఒకరోజు ముందుగా ఫస్ట్ ట్రిగ్గర్ పేరుతో వీడియో గింప్స్‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారు.

‘రేడియోలో వాతావరణ వార్తలతో ప్రారంభమైన వీడియోలో కొంతమంది చేతిలో ఆయుధాలతో వస్తారు. అక్కడే కుర్చీలో కూర్చుని చేతిలో గన్ పట్టుకున్న సుధీర్ బాబు.. ‘అందరు పవర్ కోసం గన్ పట్టుకుంటారు... కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది... ఇది నాకేమో సెప్తా వుంది..’ అని కుప్పం యాసలో ఆ తుపాకి గురించి చెప్పాడు.

సుధీర్ బాబు వాయిస్‌‌‌‌‌‌‌‌తో పాటు అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేశాయి. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో జరిగే కథ ఇది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22న సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. అదే డేట్‌‌‌‌‌‌‌‌కి వెంకటేష్ ‘సైంధవ్‌‌‌‌‌‌‌‌’తో పాటు నాని కొత్త సినిమా రిలీజ్ కానున్నాయి. 

https://youtu.be/OQFECPVZ-gc