
సినిమా సినిమాకీ జానర్ మార్చేస్తూ, డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్న సుధీర్‌బాబు.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే హంట్, మామ మశ్చీంద్ర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలోనూ నటించనున్నట్టు ఇటీవల ప్రకటించాడు. ఈ మూవీకి ‘హరోం హర’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు నిన్న రివీల్ చేశారు. ‘ద రివోల్ట్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మూవీ ఇది. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 కాలంలో జరిగిన కథ. అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో టెంపుల్‌తో పాటు అక్కడి జగదాంబ టాకీస్, కుప్పం రైల్వేస్టేషన్‌ను కూడా చూపించడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ‘ఇంగ సెప్పేది ఏం లేదు.. సేసేదే’ అంటూ చిత్తూరు యాసలో సుధీర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. జి.రమేష్ కుమార్ సమర్పణలో సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాల్ని ప్రకటిస్తామని చెప్పారు.