లవర్​ మోసం చేసిందని  సూసైడ్

లవర్​ మోసం చేసిందని  సూసైడ్

 బహ్రెయిన్​ నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహం
ప్రేయసి కుటుంబీకులను శిక్షించాలంటూ రాస్తారోకో

మాక్లూర్, వెలుగు: లవర్​ మోసం చేసిందంటూ ఓ యువకుడు బహ్రెయిన్​లో 10 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం స్వగ్రామానికి చేరడంతో కుటుంబీకులు, బంధువులు యువతి కుటుంబీకులను శిక్షించాలంటూ శనివారం ఆందోళనకు దిగారు. నిజామాబాద్​ జిల్లా మాక్లూర్ మండలంలోని రాంచెంద్రాపల్లి గ్రామానికి చెందిన ఐండ్ల సుధీర్(24), అదే గ్రామానికి చెందిన యువతి నాలుగేండ్లుగా ప్రేమించుకున్నారు.పెండ్లి చేసుకుందామంటే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. డబ్బులు సంపాదించుకున్న తర్వాత పెండ్లి చేసుకుందామని, రెండేండ్ల క్రితం సుధీర్​బహ్రెయిన్​వెళ్లాడు. కొంతకాలం ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. అదే గ్రామానికి చెందిన పెళ్లైన యువకుడితో యువతి ప్రేమ వ్యవహారం నడుపుతోందని సుధీర్​కు తెలిసింది. ప్రేమికురాలిని ఫోన్​లో హెచ్చరించినా వినలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది తాను ప్రేమలో మోసపోయానని, సూసైడ్ ​చేసుకుంటున్నట్లు  ఈ నెల 15న బంధువులకు వాయిస్ మెసేజ్​చేసి రూంలో ఉరేసుకున్నాడు. శనివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పోస్ట్​మార్టం అనంతరం కుటుంబీకులు శవంతో రాంచెంద్రపల్లికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని పంచాయతీ ముందు టెంట్​వేసుకుని మూడు గంటలపాటు  బైఠాయించారు. అనంతరం ఇక్కడైతే తమ సమస్య పరిష్కారం కాదని బంధుమిత్రులు శవంతో 66వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. 2 గంటలపాటు ఆందోళన చేయడంతో ఇరువైపులా వెహికల్స్​నిలిచిపోయాయి. నిజామాబాద్  ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ ఆందోళనకారులతో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో 
విరమించారు.