కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ చెబితే బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చారు

కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ చెబితే బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చారు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ చెబితేనే  సుఖేశ్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చారని సుఖేశ్ న్యాయవాది అనంత్ మాలిక్ వెల్లడించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన 6060 నంబర్​ రేంజ్ రోవర్ కారులోని ‘ఏపీ’ వ్యక్తి కి ఈ డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. ఇదే అంశాన్ని సుఖేశ్ తన లేఖలో వివరించారన్నారు. శనివారం ఢిల్లీలోని పటియాల కోర్టు ఆవరణలో అడ్వకేట్ అనంత్ మాలిక్ మీడియాతో మాట్లాడారు. ‘చంద్ర శేఖర్ రాసిన లేఖ కేవలం ట్రైలర్ మాత్రమే, పెద్ద సినిమా ముందుంది’ అని అన్నారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, చంద్రశేఖర్​ మధ్య సాగిన 700 చాట్స్, ఆడియో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయన్నారు. వచ్చే వారం వరకు ఆగితే  నిజాలన్నీ ప్రజల ముందుకు వస్తాయన్నారు. సుఖేశ్ చంద్రశేఖర్ పై మోపిన మనీలాండరింగ్ నేరారోపణలు ఇంకా నిరూపితం కాలేదన్నారు. నిబంధనల ప్రకారం ఆయన జైలు నుంచి లేఖలు రాయవచ్చని క్లారిటీ ఇచ్చారు.