సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్‌.. ఇండియా రన్నరప్‌తో సరి

సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్‌.. ఇండియా రన్నరప్‌తో సరి

మలేసియా: సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్‌లో ఇండియా రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో బెల్జియం 1-0 తేడాతో ఇండియాను ఓడించి తమ తొలి అజ్లాన్ షా టైటిల్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌ను బెల్జియం ఆటగాడు థిబౌ స్టాక్‌‌‌‌‌‌‌‌బ్రోయెక్స్ 34వ నిమిషంలో సాధించాడు.  తమకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్లను గోల్‌‌‌‌‌‌‌‌గా మలచడంలో ఇండియా విఫలమైంది.