
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ టౌన్ లోని ఆర్యవైశ్య భవన్ లో గణేశ్ మండపాన్ని శుక్రవారం కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ. 500, రూ. 100, రూ. 50, రూ. 20, రూ.10 నోట్లతో రూ.9,99, 999 విలువ చేసే నోట్లను వినియోగించారు. అనంతరం నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. కరెన్సీ అలంకరణ తో మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులను ఆకట్టుకుంటుంది.