ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సమ్మర్ సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి జూన్ 11 వరకు బడులకు వేసవి సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  జూన్ 12వ తేదీన తిరిగి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నట్లు తెలిపింది. దీంతో ఈ నెల 23తో విద్యా సంవత్సరం ముగియనుంది. మొత్తం 50 రోజులపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు వేస‌వి సెల‌వులు వర్తించనున్నాయి. ఇక, రాష్ట్రంలో మార్చి 18 నుంచి ఒంటి బడులు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. 

కాగా, మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ జరుగుతోంది.ఏప్రిల్ చివరి వారం, లేద మే మొదటి వారంలో పరీక్ష ఫలితాలను ప్రకటించనున్నారు.