వరల్డ్‌‌ స్విమ్మింగ్ చాంపియన్‌‌షిప్స్‌‌లో మార్చండ్‌‌కు మరో గోల్డ్‌‌

వరల్డ్‌‌ స్విమ్మింగ్ చాంపియన్‌‌షిప్స్‌‌లో మార్చండ్‌‌కు మరో గోల్డ్‌‌

సింగపూర్: వరల్డ్‌‌ స్విమ్మింగ్ చాంపియన్‌‌షిప్స్‌‌లో  ఫ్రాన్స్ స్టార్‌‌‌‌ స్విమ్మర్ లియోన్ మార్చండ్ మరో గోల్డ్‌‌ మెడల్‌‌తో మెరిశాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌ 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో 4 నిమిషాల 04.73 సెకండ్ల టైమింగ్‌‌తో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో అతనికి ఇది రెండో గోల్డ్‌‌. అంతకుముందు 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో వరల్డ్‌‌ రికార్డుతో స్వర్ణం గెలిచాడు. 4x100 మెడ్లే రిలేలో సిల్వర్ నెగ్గిన అతను బెస్ట్‌ స్విమ్మర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

 విమెన్స్‌లో కెనడా అమ్మాయి మెకింతోష్ 4 గోల్డ్‌, ఒక బ్రాంజ్ నెగ్గి బెస్ట్ స్విమ్మర్‌‌గా నిలిచింది.  కాగా, ఈ మెగా టోర్నమెంట్‌‌లో ఇండియా  స్విమ్మర్లు తీవ్రంగా నిరాశపరిచారు. 400 మీటర్ల మెడ్లేలో షోన్ గంగూలీ హీట్స్‌‌ దాటలేకపోయాడు.  నేషనల్ రికార్డుతో ఈ టోర్నీకి అర్హత సాధించిన 20 ఏండ్ల షోన్ 4 నిమిషాల 30.40 సెకండ్ల టైమింగ్‌‌తో 28వ స్థానంతో సరిపెట్టాడు.   ఈ టోర్నీలో పోటీ పడ్డ ఇండియా స్విమ్మర్లంతా హీట్స్ దాటి ఫైనల్స్‌‌కు అర్హత సాధించలేకపోవడం గమనార్హం. ఒక్కరు కూడా తమ పర్సనల్ బెస్ట్ టైమింగ్‌‌ను మెరుగుపరుచుకోలేకపోయారు.