
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బజరంగ్‌దళ్‌ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. సంగ్రూర్‌కు చెందిన ఆ సంఘం వ్యవస్థాపకుడు హితేష్ భరద్వాజ్ స్థానిక జిల్లా కోర్టులో ఖర్గే పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు సివిల్ జడ్జి రమణదీప్ కౌర్, ఖర్గేకు సమన్లు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ బజరంగ్దళ్ ని దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని సంగ్రూర్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేస్తామని అనడం, అదే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టడంపై ఆ సంఘం కార్యకర్తలు గతంలోనే నిరసనలు తెలిపారు. ఇందుకు నిరసనగానే తాను కోర్టు ను ఆశ్రయించినట్లు సంగ్రూర్ తెలిపారు.