సుందర్ పిచయ్‌‌‌‌ జీతం 226 మిలియన్ డాలర్లు

  సుందర్ పిచయ్‌‌‌‌ జీతం 226 మిలియన్ డాలర్లు

న్యూఢిల్లీ: గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్‌‌‌‌ కిందటేడాది  రూ. 1,853 కోట్ల (226 మిలియన్ డాలర్లు) జీతం అందుకున్నారు. ఈ కంపెనీలోని  ఉద్యోగులు అందుకుంటున్న సగటు జీతం కంటే ఇది 800 రెట్లు ఎక్కువ. పిచయ్‌‌‌‌ అందుకున్న జీతంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ ఉన్నాయి. 2021 లో 6.3 మిలియన్ డాలర్ల జీతం పొందారు. ఇందులో ఎటువంటి స్టాక్ అవార్డ్స్‌‌‌‌ లేవు. సుందర్ పిచయ్ ప్రతీ మూడేళ్లకు ఒకసారి స్టాక్ అవార్డ్స్ అందుకుంటున్నారు. 2019 లో కూడా  281 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డ్స్ పొందారు.  కంపెనీ పెర్ఫార్మెన్స్ పెరిగితే టాప్ ఉద్యోగులకు షేర్లను కాంపెన్సేషన్‌‌‌‌గా ఇస్తుంటారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా గూగుల్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌గా 12 వేల మంది ఉద్యోగులను తీసేసింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ ఉద్యోగి సగటు జీతానికి, సీఈఓకి మధ్య గ్యాప్ భారీగా ఉందనే విషయం బయటికొచ్చింది.