Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం సినిమాల్లో నటుడిగా కొనసాగుతున్నారు కమెడియన్ వైవా హర్ష(Viva Harsha). వైవా అనే షార్ట్ ఫిలిం ద్వార ఫేమస్ అయినా ఈ నటుడు.. తాజాగా హీరోగా మారి సుందరం మాస్టర్(Sundaram Mastar) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ మహారాజ్ రవితేజ నిర్మాతగా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ తెరకెక్కించారు. దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించిన ఈ సినిమా  ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచింది. టీజర్, ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లో మాత్రం అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. దాంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ వచ్చాయి. 

ఇప్పుడు ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. సుందరం మాస్టర్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొతం చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా మార్చ్ 28 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్ లో అంతగా అలరించని సుందరం మాస్టర్.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.