హరోమ్ హర.. మరో పవర్ఫుల్ క్యారెక్టర్లో సునీల్

హరోమ్ హర.. మరో పవర్ఫుల్ క్యారెక్టర్లో సునీల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్(Sunil)..ఇప్పుడు పుష్పతో విలన్గా మారి..తనదైన శైలిలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. మొన్నటికి మొన్న జైలర్, మార్క్ ఆంథోనీ,జపాన్ వంటి మూవీస్లో నటించి ఫేమస్ అయిపోయారు.  

సుధీర్ బాబు (Sudheerbabu) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్-డ్రామా మూవీ హరోమ్ హర (Harom Hara). ఈ మూవీలో సునీల్ క్యారెక్టర్కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో పళని సామి అనే తమిళ క్యారెక్టర్ను పోషిస్తున్నాడు సునీల్.

ఈ పోస్టర్ను గమనిస్తే..గతానికి సంబంధించిన ఫైల్..దాని చుట్టూ పేపర్ కటింగ్స్..తుపాకీ..బుల్లెట్లు..సీరియస్ లుక్లో సునీల్..ఇవన్నీ చూస్తుంటే నెగిటివ్ షేడ్స్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సునీల్ చేతిలో గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, పుష్ప 2 మూవీస్ తో పాటు..పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. 
 
హరోమ్ హర మూవీని చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సెహరి మూవీ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక. ఈ మూవీని తెలుగు ప్రాంతాల వరకే కాకుండా..పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో రానున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మిస్తోంది.