లోకల్ బాడీ ఎన్నికలపై నేడు (జూలై 15న) బీజేపీ వర్క్ షాప్..అటెండ్ కానున్న సునీల్ బన్సల్

లోకల్ బాడీ ఎన్నికలపై నేడు (జూలై 15న) బీజేపీ వర్క్ షాప్..అటెండ్ కానున్న సునీల్ బన్సల్

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికలకు బీజేపీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా మంగళవారం ఘట్ కేసర్​లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రస్థాయి వర్క్​షాప్​ నిర్వహించనున్నది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అటెండ్ కానున్నారు. 

ఈ సందర్భంగా లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, ఎన్నికల ఇన్ చార్జులు అటెండ్ కానున్నారు.