శుభ్మన్ గిల్ నిక్ నేమేంటో తెలుసా..!

శుభ్మన్ గిల్ నిక్ నేమేంటో తెలుసా..!

టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ అదరగొడుతున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో డబుల్ సెంచరీతో కదం తొక్కిన గిల్..రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. కామెంటరీలో ఉన్న సమయంలో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ను కొనియాడిన గవాస్కర్..అతనికి నిక్ నేమ్ కూడా పెట్టాడు. 

న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ వన్డే తర్వాత శుభ్‌మన్ గిల్‌కు సునీల్ గవాస్కర్ కొత్త పేరు పెట్టాడు. హైదరాబాద్ వన్డే సమయంలో కామెంటరీ చేస్తున్న సమయంలో సునీల్ గవాస్కర్ శుభ్‌మన్ గిల్‌కు 'స్మూత్‌మన్ గిల్' అనే పేరు పెట్టాడు. అనంతరం  హైదరాబాద్ వన్డే తర్వాత గిల్తో మాట్లాడిన సునీల్ గవాస్కర్..తాను కొత్త పేరు పెట్టానని చెప్పాడు. దీంతో  శుభమన్ గిల్ ముఖంలో చిరునవ్వు మెరిసింది. సునీల్ గవాస్కర్ పెట్టిన స్మూత్ మన్ గిల్  పేరు కూడా తనకు నచ్చిందని గిల్ తెలిపాడు.