BCCI : సెలక్టర్లంతా ఫ్యాషన్ షోకి వెళ్లండి : సునీల్ గవాస్కర్

BCCI : సెలక్టర్లంతా ఫ్యాషన్ షోకి వెళ్లండి : సునీల్ గవాస్కర్

చేతన్ శర్మ నేతృత్వంలోని టీమిండియా సెలక్షన్ కమిటీ బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ ఖాన్‌ను పట్టించుకోవట్లేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. గత కొంతకాలంగా రంజీ ట్రోఫీలో రాణిస్తున్నా అతన్ని టెస్ట్ టీంలోకి తీసుకోకపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించాడు. ఆటగాళ్ల ఆకృతిని చూసి కాకుండా టాలెంట్ ఆధారంగా జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. స్లిమ్ గా ఉన్న ఆటగాళ్లు కావాలంటే.. ఫ్యాషన్ షోకి వెళ్లి అక్కడి మోడల్స్ కు బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులోకి తీసుకోండని సన్నీ ఫైర్ అయ్యాడు.

యోయో టెస్ట్ లో ఆటగాళ్లు లావుగా ఉంటే గేమ్ కు అన్ ఫిట్ అనే రూల్ ఉంది. గత కొంతకాలంగా ఆటలో రాణిస్తున్న సర్ఫరాజ్ ని సెలక్టర్లు జట్టులోకి తీసుకోకపోవడానికి కారణం కూడా అదే అంటున్నారు సీనియర్లు. అయితే, దీనిపై కొంత వ్యతిరేకత కూడా ఉంది. ‘లావుగా ఉంటే సర్ఫరాజ్ ఆటలో ఎలా రాణించగలడు. ఫిట్ గా ఉన్నందునే సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. ఫిట్ నెస్ అనేది వ్యక్తి ఆకారాన్ని బట్టి ఉండదు. క్రికెట్ లో ప్రతీ వ్యక్తి ఒకే రీతిలో ఉన్నాడా? యోయో టెస్ట్ ను ప్రామాణికంగా తీసుకొని ఆటగాళ్లను జట్టుకు దూరం చేయడం చాలా తప్పు’ అంటూ సెలక్టర్లపై గవాస్కర్ విరుచుకు పడ్డాడు.