జైలర్ నుంచి సునీల్ ఫస్ట్ లుక్

జైలర్ నుంచి సునీల్ ఫస్ట్ లుక్

నటుడు సునీల్ కమెడియన్‌‌గా కెరీర్‌‌‌‌ ప్రారంభించి హీరోగా, విలన్‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా ప్రూవ్ చేసుకున్నాడు. లీడ్ రోల్స్ చేస్తూనే.. వచ్చిన ప్రతి చాన్స్‌‌ని చక్కగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌‌ నటిస్తున్న ‘జైలర్‌‌‌‌’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తన క్యారెక్టర్‌‌‌‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌‌ను మంగళవారం రిలీజ్ చేశారు.

ఇందులో మార్షల్​ ఆర్ట్స్​ ట్రైనర్​ కాస్ట్యూమ్స్​తో సీరియస్‌‌ లుక్‌‌లో కనిపిస్తున్నాడు సునీల్. ఈ పోస్టర్‌‌‌‌ను బట్టి సునీల్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడని అర్ధమవుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్‌‌కుమార్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.