న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీని వదులుకోవడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. గతేడాది వేలంలో రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన షమీని లక్నో సూపర్ సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ)కు ట్రేడ్ చేసేందుకు ఇరు ఫ్రాంచైజీలు అంగీకరించినట్టు తెలుస్తోంది. గత సీజన్ ఐపీఎల్‌లో రైజర్స్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడిన షమీ 6 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ప్రస్తుతం నేషనల్ టీమ్‌కు కూడా దూరమయ్యాడు.
