శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి సూపర్  యాప్

 శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి సూపర్  యాప్
  • ఇదేబాటలో మరిన్ని కంపెనీలు
  • ఒకే చోట అన్ని రకాల సేవలు

న్యూఢిల్లీ: తమ కంపెనీకి సంబంధించిన అన్ని సేవలనూ ఒకే చోట అందించేందుకు త్వరలోనే సూపర్​ యాప్​ను తీసుకొస్తున్నామని నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్స్​ కంపెనీ శ్రీరామ్​ సిటీ యూనియన్​ ఫైనాన్స్​ (ఎస్​సీయూఎఫ్) తెలిపింది. ఇది వరకే బజాజ్​ ఫైనాన్స్​ వంటి కంపెనీలు ఇటువంటి యాప్​లను తయారు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్​డెవలప్​మెంట్​ పూర్తి కావడానికి దాదాపు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని, సూపర్​యాప్​ ద్వారా అన్ని రకాల ఫైనాన్షియల్​ ప్రొడక్టులను అందిస్తామని  ఎస్​సీయూఎఫ్​ సీఈఓ వైఎస్​ చక్రవర్తి వెల్లడించారు. రిలయన్స్​క్యాపిటల్, శ్రేయ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఫైనాన్స్​ వంటి ఎన్​బీఎఫ్​సీ కంపెనీల్లో భారీ అవకతవకలు జరిగినట్టు వార్తలు రావడంతో ఆర్​బీఐ కలగజేసుకుంది.

బోర్డుల్లో మార్పులు చేర్పులు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్​బీఎఫ్​సీ కంపెనీలు సూపర్​యాప్​లను తీసుకొచ్చే పనిలో పడ్డాయి. పేటీఎం వంటి ఫిన్​టెక్​ కంపెనీలు, స్టార్టప్​లు ఇది వరకే ఇట్లాంటి యాప్స్​ను అందుబాటులోకి తెచ్చాయి. పేటీఎం యాప్​ ద్వారా అన్ని రకాల ఫైనాన్షియల్​ ప్రొడక్టులను, సేవలను పొందవచ్చు. బిల్స్​ పేమెంట్స్​, స్టాక్​ బ్రోకింగ్​, బ్యాంకింగ్​, మ్యూచువల్​ ఫండ్స్​, షాపింగ్​, వ్యాలెట్​, రీచార్జ్​, లోన్ల వంటి ఎన్నో ప్రొడక్టులను అందిస్తున్నామని పేటీఎం సీనియర్​ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.
మూడు శ్రీరామ్​ కంపెనీల విలీనం
కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌ ఫైనాన్షియర్‌‌‌‌ శ్రీరామ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఎస్‌‌‌‌టీఎఫ్‌‌‌‌సీ), నాన్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కంపెనీ శ్రీరామ్‌‌‌‌ సిటీ యునియన్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఎస్‌‌‌‌సీయుఎఫ్‌‌‌‌), ప్రమోటర్‌‌‌‌ సంస్థ శ్రీరామ్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఎస్‌‌‌‌సీఎల్‌‌‌‌)లు ఒకే కంపెనీగా మారినట్టు సంస్థ గత నెల ప్రకటించింది.  ఈ మూడింటినీ కలిపేందుకు సంబంధిత డైరెక్టర్లు అంగీకరించారు. కొత్త కంపెనీని శ్రీరామ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌గా పిలుస్తున్నారు. ఈ విలీనానికి సంబంధిత కంపెనీల షేర్‌‌‌‌హోల్డర్లు,   రెగ్యులేటరీ ఏజెన్సీల నుంచి అనుమతులు రావాల్సి ఉందని కంపెనీ అప్పుడు ప్రకటించింది. ఈ విలీన ఒప్పందం ప్రకారం ప్రతి ఎస్‌‌‌‌సీయుఎఫ్‌‌‌‌ షేర్‌‌‌‌కూ 1.55 షేర్ల చొప్పున  శ్రీరామ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ జారీ చేయనుండగా, ఎస్‌‌‌‌సీఎల్‌‌‌‌  ప్రతి షేర్‌‌‌‌కూ 0.09783305 షేర్లను జారీ చేయనుంది.

ఈ విలీనంతో కమర్షియల్‌‌‌‌, టూవీలర్‌‌‌‌, గోల్డ్‌‌‌‌, పర్సనల్‌‌‌‌, ఆటో లోన్‌‌‌‌లను ఒకే ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పైకి తీసుకురావడం సాధ్యమవుతుంది.  ఫలితంగా  భారతదేశంలో అతిపెద్ద రిటైల్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీగా ఎస్​సీయూఎఫ్ ఎదుగుతుంది కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇది రూ.1.5 లక్షల విలువైన ఆస్తులను ఆపరేట్ చేస్తోంది. శ్రీరామ్​ ట్రాన్స్​పోర్ట్ కస్టమర్లలో కనీసం 30 శాతం మంది ఎస్​సీయూఎఫ్​ ప్రొడక్టులపై ఆసక్తి చూపిస్తున్నారని చక్రవర్తి చెప్పారు. ఇక నుంచి మొత్తం లోన్లలో 30 శాతానికిపైగా సూపర్​యాప్​ ద్వారానే వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు.