వచ్చే ఏడాది చివరకు మన  సెన్సెక్స్‌‌ @ 50,000

వచ్చే ఏడాది చివరకు మన  సెన్సెక్స్‌‌ @ 50,000
  •     బుల్లిష్‌‌ట్రెండ్‌‌ ఉంటే   59 వేలు దాటేస్తుంది
  •     ప్రభుత్వం, ఆర్‌‌బీఐ ప్యాకేజ్‌‌లు భేష్‌‌
  •     వ్యాక్సిన్‌‌తో కరోనా భయం పోతోంది

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు  : వచ్చే ఏడాది చివరికల్లా బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్‌‌‌‌50 వేల మార్కును అందుకుంటుందని మోర్గాన్‌‌‌‌స్టాన్లే అంచనా వేస్తోంది. జూన్‌‌‌‌2021 నాటికి సెన్సెక్‌‌‌‌37,300 పాయింట్లను దాటుతుందని అంతకు ముందు ఇచ్చిన అంచనాలను మోర్గాన్‌‌‌‌స్టాన్లే తాజాగా సవరించింది. కోవిడ్‌‌‌‌–19 కేసులు ఇప్పటికే పీక్‌‌‌‌లెవెల్స్‌‌‌‌కు చేరుకున్న నేపథ్యంలో గ్రోత్‌‌‌‌ఇండికేటర్స్‌‌‌‌అన్నీ పటిష్టంగా కనిపిస్తున్నాయని ఇండియాపై తన అంచనాలను వెల్లడించింది మోర్గాన్‌‌‌‌స్టాన్లే. ప్రభుత్వం సరయిన దిశలో చర్యలు తీసుకుంటోందని చెబుతోంది. ఇండియాలోని కంపెనీల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయని, ఫలితంగా గ్రోత్‌‌‌‌మరింత మెరుగవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. రియల్‌‌‌‌ఎస్టేట్‌‌‌‌రంగం పుంజుకోవడానికి మాత్రం చాలా నెలలు పడుతుందని ఈ నోట్‌‌‌‌లో మోర్గాన్‌‌‌‌ స్టాన్లే చెబుతోంది. రాబోయే మూడేళ్లకు బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్‌‌‌‌ఈపీఎస్‌‌‌‌(ఎర్నింగ్స్‌‌‌‌పర్‌‌‌‌షేర్‌‌‌‌)ను కూడా పైకి సవరించింది. 2021 ఫైనాన్షియల్‌‌‌‌ఇయర్లో ఈ ఈపీఎస్‌‌‌‌15 శాతం, 2022లో 10 శాతం, 2023లో 9 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. అందరూ వేస్తున్న 6–7 శాతం అంచనాల కంటే ఇవి ఎక్కువ.

ప్రపంచంలోని ఇతర మార్కెట్లలోలాగే ఇండియా స్టాక్‌‌‌‌మార్కెట్లోనూ కరోనా టైంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. జనవరిలోని పీక్‌‌‌‌లెవెల్‌‌‌‌నుంచి మార్చి చివరి నాటికి మన స్టాక్‌‌‌‌మార్కెట్లు 40 శాతం నష్టపోయాయి. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌విధింపు నేపథ్యంలో ఇతర మార్కెట్లతోపాటు సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీలూ పతనమయ్యాయి. అయితే, అంతే వేగంగా ఆ నష్టాలను రికవర్‌‌‌‌చేసుకున్నాయి మార్కెట్లు. ఎకానమీ రికవరీకి ప్రభుత్వం, ఆర్‌‌‌‌బీఐ తీసుకున్న  చర్యలతోనే మార్కెట్లు జోరందుకున్నాయి. అన్‌‌‌‌లాక్‌‌‌‌ప్రకటించిన తర్వాత అనుకున్న దానికంటే ఎకానమీ జోరు మరింత పెరిగింది.  కోవిడ్‌‌‌‌–19 వ్యాక్సిన్‌‌‌‌ప్రయోగాలు కూడా సక్సెస్‌‌‌‌వైపు సాగుతుండడమూ మార్కెట్‌‌‌‌రికవరీకి మరో కారణమని మోర్గాన్‌‌‌‌స్టాన్లే నోట్‌‌‌‌అంచనా వేసింది. బుల్స్‌‌‌‌ఊపు జోరుగా కొనసాగితే బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్‌‌‌‌59 వేల మార్కును దాటేస్తుందని, అంటే ఇప్పటి లెవెల్‌‌‌‌నుంచి 35 శాతం పెరుగుతుందని పేర్కొంటోంది. కరోనా పరిస్థితులు మెరుగుపడతాయని, గ్లోబల్‌‌‌‌స్టిమ్యులస్‌‌‌‌సపోర్ట్‌‌‌‌నేపథ్యంలో గ్రోత్‌‌‌‌స్థిరంగా ఉంటుందని మోర్గాన్‌‌‌‌స్టాన్లే అంచనా వేస్తోంది. ఇక బేర్‌‌‌‌మార్కెట్‌‌‌‌ఉంటే, సెన్సెక్స్‌‌‌‌37 వేల పాయింట్లకు, అంటే 15 శాతం పడే ఛాన్స్‌‌‌‌ఉండొచ్చని తెలిపింది. కరోనా వైరస్‌‌‌‌కేసులు కొనసాగి, ఫైనాన్షియల్‌‌‌‌సిస్టమ్‌‌‌‌నష్టాలపాలయితే బేర్‌‌‌‌మార్కెట్‌‌‌‌కు అవకాశం కలుగుతుందని వెల్లడించింది.

ముఖ్యంగా మిడ్‌‌‌‌, స్మాల్‌‌‌‌క్యాప్‌‌‌‌కంపెనీలు పెద్ద కంపెనీలను బీట్ చేస్తాయని మోర్గాన్‌‌‌‌స్టాన్లే అంచనా వేస్తోంది. గ్రోత్‌‌‌‌మెరుగవడం ముందుగా చిన్న కంపెనీలకే మేలు చేస్తుందని చెబుతోంది. జీడీపీ, మనీ సప్లయ్‌‌‌‌లతో చూసినప్పుడు స్మాల్‌‌‌‌, మిడ్‌‌‌‌క్యాప్‌‌‌‌షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని పేర్కొంది.