LHS 1140b: విశ్వంలో భూమి లాంటి మరో గ్రహం

 LHS 1140b: విశ్వంలో భూమి లాంటి మరో గ్రహం

అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. మానవులు జీవించే విధంగా ఉన్నది ఒక్క భూమి మాత్రమే. ఇప్పుడు మన భూమిని పోలి ఉన్న మరో గ్రహం అంతరిక్షంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అత్యంత దగ్గరగా తీసిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఆ గ్రహంపై.. భూమిపై ఉన్నట్లు సముద్రాలు ఉన్నాయనేది ఆ ఫొటోలు చూస్తే స్పష్టమవుతోంది. మొదట దీనిని ఓ చిన్న గ్రహంగా భావించినా.. పరిశోధనల తర్వాత ఆ గ్రహంపై రాళ్లు, రప్పలు, నీళ్లు ఉండే అవకాశం ఉందని బలంగా విశ్వసిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది భూమి కంటే చాలా పెద్దగా ఉందని చెబుతున్నారు. 

శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, LHS 1140b Cetusగా పిలవబడుతున్న ఈ గ్రహం సుమారు 48 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు అంచనా వేశారు. ఈ గ్రహం ప్రవర్తన కారణంగా జీవం మనుగడ సాగించే అవకాశం ఉంటుందనేది శాస్త్రవేత్తల నమ్మకం. ఎల్‌హెచ్ఎస్ 1140బి గ్రహాన్ని చుట్టుముట్టి ఉన్న నక్షత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. మొదట్లో మందపాటి హైడ్రోజన్-రిచ్ వాతావరణంతో మినీ-నెప్ట్యూన్‌గా భావించబడినప్పటికీ, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) నుండి వచ్చిన కొత్త డేటాలో ఇది భూమి కంటే పెద్ద గ్రహమని నిరూపించింది. రాళ్లు, నీరు, మంచు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

"రాతి లేదా మంచు అధికంగా ఉండే నివాసయోగ్యమైన జోన్‌లో వాతావరణం చూడటం ఇదే మొదటిసారి. ఎక్సోప్లానెట్.." అని గ్రహం యొక్క వాతావరణాన్ని విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించిన మిచిగాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ర్యాన్ మెక్‌డొనాల్డ్ పేర్కొన్నారు. 

ALSO READ | భారత్ లో పేదరికంపై ఎన్​సీఏఈఆర్ నివేదిక

 LHS 1140b యొక్క ద్రవ్యరాశిలో 10 నుండి 20% నీరు కలిగి ఉండవచ్చని పరిశోధనలో వెల్లడైంది. అలాగే, మధ్య భాగంలో 20 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రత ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, నత్రజని అధికంగా ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇతర వాయువుల ఉనికి కోసం మరిన్ని పరిశీలనలు అవసరమని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, భవిష్యత్తులో భూమి అంతమవుతోందంటే, మరో గ్రహానికి వెళ్లడానికి దారులు కనబడుతున్నాయనమాట.