నాలాగే.. ప్రతీ తండ్రి గుండెలో ప్రతిధ్వనిస్తుంది.. గాజు బొమ్మ పాటపై మహేష్ ఎమోషనల్ ట్వీట్

నాలాగే.. ప్రతీ తండ్రి గుండెలో ప్రతిధ్వనిస్తుంది.. గాజు బొమ్మ పాటపై మహేష్ ఎమోషనల్ ట్వీట్

నేచురల్ స్టార్ నాని(Nani), సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Naanna). కొత్త దర్శకుడు శౌర్యువ్(Shouryuv) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో.. నాని కూతురిగా బేబీ కియారా(Baby kiara) నటిస్తోంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీని.. వైరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి.. తాజాగా గాజుబొమ్మ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 

తండ్రి, కూతురు మధ్య ఉండే ప్రేమ నేపధ్యంలో వచ్చిన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అనంత శ్రీరామ్ లిరిక్స్, హేషామ్ అద్భుతమైన గాత్రం వెరసి పాటను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళాయి. దీంతో విడుదలైన కొన్ని క్షణాల్లోనే రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది ఈ పాత. 

ఇక తాజాగా ఈ పాటపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. తన ట్వీట్‌ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.. ఒక తండ్రి నుంచి అతని కుమార్తె వరకు.. నాలాగే.. ప్రతి తండ్రి గుండెలో ప్రతిధ్వనించే పాట. హాయ్ నాన్న చిత్ర యూనిట్ కు నా ఆల్‌ ది బెస్ట్.. అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.