అర్థమైందా రాజా : మొరగని కుక్కలేదు... విమర్శించని నోరు లేదు : రజినీకాంత్

అర్థమైందా రాజా : మొరగని కుక్కలేదు... విమర్శించని నోరు లేదు : రజినీకాంత్

తమిళ సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్క డైలాగ్.. అది కూడా రజినీకాంత్ నోటి నుంచి వచ్చిన డైలాగ్.. ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ రజినీకాంత్ ఎవర్ని ఉద్దేశించి అన్నారు.. ఎవర్ని టార్గెట్ చేశారు.. ఎవరికి చురకలు అంటించారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ రజినీకాంత్ ఏమన్నారో ఓసారి చూద్దాం..

మొరగని కుక్కలేదు... విమర్శించని నోరు లేదు... ఈ రెండు జరగని ఊరు లేదు.. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్ధం అయిందా రాజా! అంటూ తనదైన స్టయిల్ లో రజినీకాంత్ అన్నారు. జైలర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ చేయటం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. 

రజినీకాంత్ చివర్లో.. అర్థమయ్యిందా రాజా అని అనటం చూస్తుంటే.. ఎవర్ని ఉద్దేశించి మాట్లాడారు అనేది తీవ్ర చర్చకు దారి తీసింది. పవన్ కల్యాణ్ యాంటీ బ్యాచ్ మాత్రం.. పవన్ కల్యాణ్ కే ఈ డైలాగ్స్ అంటుంటే.. కాదు కాదు.. ఇటీవల రజినీకాంత్ గురించి తమిళ ఇండస్ట్రీలో కొంత మంది రాజకీయ కామెంట్లు చేశారు.. వాళ్లను టార్గెట్ చేసి ఈ మాటలు మాట్లాడారు అంటున్నారు.

రజినీకాంత్ ఎవర్ని ఉద్దేశించి అన్నా.. అతని మాటల్లో మాత్రం సత్యం, వాస్తవం ఉంది. నిజమే కదా.. మొరగని కుక్కలేదు... విమర్శించని నోరు లేదు... ఈ రెండు జరగని ఊరు లేదు.. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్ధం అయిందా రాజా!